విజయవాడ కార్పొరేషన్‌లో మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలపై రగడ.
విజయవాడ : విజయవాడ కార్పొరేషన్‌లో మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలపై రగడ రాజుకుంది. శనివారం ఉదయం విజయవాడ కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్ లో ఉన్న ఎన్‌టిఆర్, చంద్రబాబు ల ఫొటోలను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. హాల్‌లో జగన్ ఫొటో పెట్టారు. తనని అడగకుండా సిఎం జగన్ ఫొటో పెట్టడం పై మేయర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాల్ లో నుండి చంద్రబాబు ఫొటో తీసినా ఫర్వాలేదు.. కాని ఎన్‌టిఆర్ ఫొటో ఎందుకు తొలగించారని మేయర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎన్‌టిఆర్ ఫొటోతో పాటు వైఎస్‌ఆర్ ఫొటో కూడా పెట్టాలని వైసిపి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టడానికి వీలులేదని మేయర్ శ్రీధర్ చెప్పారు. చనిపోయిన ముఖ్యమంత్రుల ఫొటోలను కౌన్సిల్ హాల్ లో పెట్టడం సాంప్రదాయమని వైసిపి సభ్యులు అంటున్నారు. వైఎస్‌ఆర్, ఎన్‌టిఆర్ ఇద్దరి ఫొటోలను పెట్టాలంటూ.. మేయర్ ఫోడియం వద్ద వైసిపి కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.
Comments
Post a Comment