నేడు రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించనున్నాయి

అమరావతి

పశ్చిమబెంగాల్​లో వైద్యులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు భారత వైద్యుల సంఘం ప్రకటించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ఏపీ విభాగం వెల్లడించింది.

వైద్యులపై దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలను అందించాలని అందులో సూచించింది.

వైద్య సేవలు నిలిపివేయడానికి కారణాలు వైద్యులు ప్రజలకు వివరించాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరంది.

నేడు నల్లబ్యాడ్జీలతో విధులకు హజరుకానున్నట్లు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్ ప్రకటించారు.

బోధనాసుపత్రులు., జిల్లాసుపత్రుల్లో గంటపాటు నిరసన వ్యక్తం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదివారం రాసిన లేఖలో తెలిపారు.

వైద్యులపై దాడిని ఖండిస్తున్నామని ఇప్పటికే ఐఎఎంఏ ప్రతినిధులతో చర్చించామని అందులో వివరించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?