నిత్యవసర సరుకులు కోసం వేలుముద్రలు పడనివారు బందువుల ఆధార్ , రేషన్ కార్డు ఇవ్వాలి*
జెసి పి.ఎస్.గిరీషా
తిరుపతి, జూన్ 12: తిరుపతి పట్టణంలో తెల్ల రేషన్ కార్డు కలిగి 60 సంవత్సరముల వయస్సు పైబడి వేలుముద్రలు పడనివారు,
లెప్రసీ, పరిశ్రమల్లో పనిచేసి వేలిముద్రలు పడని వారు 60 లోపు వున్నా నామినీగా తమ బందువుల రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు జతపరచుకుని ప్రతినెలా నిత్యావసర వస్తువులు పొందడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషా పి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి పట్టణంకు సంబంధించి సహాయ పౌరసరఫరా అధికారి కార్యలయం ,
అర్బన్ తహశీల్దార్ కార్యలయం వద్ద నామినీగా బందువుల ఆధార్, లేదా రేషన్ కార్డు ప్రతిని అందించి సద్వినియోగం చేసుకోవాలని ఆప్రకటనలో జెసి తెలియజేశారు.
Comments
Post a Comment