అసెంబ్లీ, మండలి చీఫ్ విప్, విప్ పదవుల రద్దు
అమరావతి : శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రివర్గం రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శాసనసభ చీఫ్ విప్ పదవి నుంచి పల్లె రఘునాథరెడ్డిని, విప్ పదవుల నుంచి చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, బి యామినీ బాల, పిజివిఆర్ నాయుడు, అత్తార్ చాంద్‌బాషాలను శాసనమండలి చీఫ్ విప్ పదవి నుంచి పయ్యావుల కేశవ్, విప్ పదవుల నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్ధా వెంకటేశ్వరరావులను తప్పించినట్లు పేర్కొన్నారు.
వారి అధికారాలు మే 25 నుంచి రద్దు చేసినట్లు తెలిపారు.
Comments
Post a Comment