కలెక్టర్లు, ఐపీఎస్‌ అధికారుల కాన్ఫరెన్స్‌లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

కలెక్టర్లు, ఐపీఎస్‌ అధికారుల కాన్ఫరెన్స్‌లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

- గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్‌ నిర్వహిస్తాం

- గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోండి

- వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతాం

- ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌లతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో  రావాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్

- మళ్లీ గంజాయి సాగులోకి రాకుండా జీవనోపాధి పరిష్కారాలు చూడాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్

- పోలవరం నిర్వాసితుల సమస్యలపై శాశ్వతంగా గ్రీవెన్స్ సెల్ పెట్టాలని నిర్ణయించాం.

- ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా కేటాయిస్తాం.

- పోలవరం నిర్వాసితుల సమస్యలను వేగంగా పరిష్కరించాలి .

- పోలవరం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్ .

- ఆర్ధికంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం : సీఎం శ్రీ వైయస్ జగన్

- అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందే. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సీఎం ఆదేశం

- సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే

- జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దు

- దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని సీఎం ఆదేశం

- కాలుష్యానికి స్పందించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు:సీఎం

- కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలన్న సీఎం

- జవాబుదారీ తనం ఉండాలని ఆదేశించిన సీఎం. కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టిపెట్టాలన్న సీఎం

- కాలుష్యంపై నిఘా పెంచాలన్న ముఖ్యమంత్రి

- పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్న  ముఖ్యమంత్రి

- మంచి సాంకేతిక నిపుణులను కమిటీలో వేయాలన్న సీఎం

- ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్‌ చేసే పద్దతి వద్దని అధికారులకు ఆదేశం

- కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తంచేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలన్న సీఎం

- కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపట్ల అప్రమత్తతో ఉండాలన్న సీఎం

- భవిష్యత్‌ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్న సీఎం

- కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశంపై సీఎం సీరియస్‌

- ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న సీఎం వైయస్‌ జగన్‌

- ఏ పార్టీవారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశం

- పోలీసు వ్యవస్థను క్లీన్‌చేయాలని ఆదేశం

- ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

- విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్న ముఖ్యమంత్రి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?