ఇరాన్‌తో పెట్టుకుంటే ఇస్లామిక్ రీజియన్‌లో ఎవరూ అదుపుచేయలేని పరిణామాలు

జెరుసలేం:

ఇరాన్‌తో పెట్టుకుంటే ఇస్లామిక్ రీజియన్‌లో ఎవరూ అదుపుచేయలేని పరిణామాలను చూస్తారని, ఇక్కడ అడుగుపెట్టే అమెరికా బలగాల ప్రాణాలకు ముప్పు తప్పదని ఇరాన్ మేజర్ జనరల్ రషీద్ హెచ్చరించారు.

ఆదివారం టెహ్రాన్‌లో మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సైనికాధికారులతో మాట్లాడారు.

ఒక వేళ యుద్ధం మొదలైతే ఎవరూ ఊహించని, అదుపు చేయలేని స్థితికి చేరుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు ఆదివారం జరిగిన ఇరాన్ పార్లమెంట్ సమావేశంలో పలువురు సభ్యులు అమెరికాను అంతం చేయాలి అంటూ నినాదాలు చేశారు.

ఇరాన్ గగనతలంలోకి గురువారం అమెరికా డ్రోన్ అక్రమంగా చొచ్చుకొని రావడాన్ని పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?