పుష్పశ్రీవాణికి ఆ కోటాలో మంత్రి పదవి ఎలా ఇస్తారు’’
అరకులోయ: కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించడంపై గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స అభ్యంతరం వ్యక్తం చేశారు.
పుష్పశ్రీవాణి కులానికి సంబంధించి వివాదం కోర్టు విచారణలో ఉండగా.. గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
విశాఖ జిల్లా అరకులోయలో ఆయన మాట్లాడుతూ..
పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఈ అంశంలోనే గతంలో ఆమె సోదరి రామతులసి ప్రభుత్వ ఉద్యోగం కూడా కోల్పోయారన్న విషయాన్ని గుర్తు చేశారు.
రామతులసి ఎస్టీ కానప్పుడు ఆమె సోదరి పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతారన్నారు.
ఆమె మొదటిసారి గెలిచినప్పుడే కోర్టుకు వెళ్లగా, ఆ కేసు ఇంకా విచారణలో ఉందన్నారు.
Comments
Post a Comment