టీకాలు సురక్షితమేనా.. వ్యాక్సిన్లు పనిచేస్తాయా..
టీకాలు మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం అంటే, నివారించదగిన ప్రమాదకర అంటు వ్యాధులపై పోరాడటంలో ప్రపంచం వెనుకడుగు వేయడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచే టీకాల పట్ల కొన్ని ప్రాంతాల ప్రజల్లో అత్యంత ఆందోళన కలిగించే స్థాయిలో అపనమ్మకం ఉందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
140 దేశాలకు చెందిన 1,40,000 మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను బ్రిటన్ కేంద్రంగా పనిచేసే వెల్‌కం ట్రస్ట్ విశ్లేషించింది.
ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న అతిపెద్ద 10 ప్రమాదాల జాబితాలో పిల్లలకు టీకాలపై నమ్మకం లేకపోవడం అనేది కూడా ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Post a Comment