తలారీ పోస్టు కోసం తగాదాలు... పట్టపగలే కొడవలితో దాడి చేసి..

గద్వాల జిల్లా ధరూర్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. ధరూర్ మండలం ర్యాలంపాడుకు చెందిన తాయన్న తలారిగా పనిచేసేవాడు. తాయన్న మృతిచెందడంతో ఆయన కుమారుడు రాజుకు ఆ ఉద్యోగం లభించింది. దీంతో రాజు తలారీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాయన్న ఉద్యోగం విషయంలో కుటుంబలో ఘర్షణలు తలెత్తాయి. ఆ ఉద్యోగం తమకే ఇవ్వాలని తాయన్న సోదరుడు కుమాడు గొడవకు దిగారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల మధ్య ఘర్షణలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో అతడిపై పక్క ప్లాన్ ప్రకారం దాడి చేశారు. 

ఉదయం ధరూర్ నుంచి ర్యాలంపాడుకు వెళ్లిన రాజు... అక్కడ అందరిని పలకరించి తిరిగి ధరూర్‌కు తన బైక్‌పై బయల్దేరాడు. అప్పటికే మార్గం మధ్యలో కాపుకాసిన వెంకటన్న అనే వ్యక్తి వేటకొడవళ్లతో... రాజుపై దాడి చేశాడు. రాజు తలపై వేటు వేయడంతో.... సంఘటన స్థలంలోనే అతడు కుప్పకూలాడు. అయితే దాడికి దిగిన వ్యక్తిని పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నించగా... వారిని కొడవలితో.... భయపెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. పట్టపగలే హత్య జరుగడంతో.... గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. 

హత్య విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ‌ ఎం.రాము తన సిబ్బందితో సంఘటన‌ స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గద్వాల సిఐ హనుమంతు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అయితే రాజుకు తలారి పోస్టు కోసం తగాదాలతోనే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?