భార్య మాట వినడం లేదని భయంకరంగా చంపేశాడు..

తన భార్య తన మాట వినడం లేదంటూ ఇరుగుపొరుగు వారు హేళన చేస్తుండడంతో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఇంగ్లండ్‌లో ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్‌కు చెందిన ఖురేషీ, పర్వీన్ భార్యాభర్తలు. ఖురేషీ ట్యాక్సీ నడుపుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. వారు కెంట్ అనే ప్రాంతంలో ఉండేవారు. అయితే, అక్కడి నుంచి మారదామని ఖురేషీ సూచించాడు. దానికి భార్య ఒప్పుకోలేదు. ఈ విషయంలో బయట ఫ్రెండ్స్‌, చుట్టాలకు తెలిసి.. ‘ఖురేషీ మాట అతని భార్య వినదు’ అనే ప్రచారం మొదలైంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అతడి చెవిన పడింది. దీంతో భార్య మీద కోపం పెంచుకున్న ట్యాక్సీ డ్రైవర్ ఇంట్లో వంటగదిలో ఉన్న భార్య మీద దాడి చేశాడు. తొలుత పెనంతో తలపై కొట్టాడు. ఆతర్వాత గొంతునులిమాడు. అప్పటికీ కసి తీరక కత్తితో ఆమెను పొడిచాడు. ఒకటి రెండు సార్లు కాదు. ఏకంగా 38 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన 2018లో జరిగింది. తాజాగా ఈ కేసులో దోషికి కోర్టు 16 సంవత్సరాల శిక్ష విధించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?