లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారం.. అసదుద్దీన్ ఛమత్కారం..
కొత్తగా కొలువుదీరిన 17వ లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.మంగళవారం తెలంగాణ ఎంపీల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రమాణస్వీకారం చేశారు.ఆ తర్వాత పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్,జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్,మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ,చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు,నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్,పసునూరి దయాకర్,బోర్లకుంట వెంకటేశ్ నేత, మాలోతు కవిత, పోతుగంటి రాములు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకార వేళ.. సభలోని బీజేపీ సభ్యులంతా 'భారత్ మాతాకీ జై' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మరింత గట్టిగా నినాదాలు చేయాలంటూ అసదుద్దీన్ ఛమత్కారంగా సైగలు చేశారు. ప్రమాణ స్వీకారం చివరలో జైభీమ్, జై మీమ్, అల్లాహ్ అక్బర్ అంటూ ముగించారాయన. బీజేపీ ఎంపీలంతా భారత్ మాతాకీ జై అంటూ తమ ప్రమాణస్వీకారాన్ని ముగించగా.. టీఆర్ఎస్ ఎంపీలు జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో ముగించారు.
Comments
Post a Comment