ఏపీలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం జగన్
అమరావతి: ఏపీలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ చర్యలు తీసుకుంటారని వైకాపా సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆ పోస్టుల భర్తీ ఉండొచ్చని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకూ ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇస్తారన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు
Comments
Post a Comment