ప్రజావేదిక అక్రమ కట్టడం అని యనమలకు తెలియదా?


రగులుతున్న ప్రజావేదిక వివాదం
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

యనమల వ్యాఖ్యలకు బదులిచ్చిన మంత్రి అనిల్

.
ఉండవల్లి ప్రజావేదిక వివాదంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

ప్రజావేదిక కూల్చివేయాలంటూ జగన్ ఆదేశించడం ఓ తుగ్లక్ చర్య అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

ప్రజావేదిక ఓ అక్రమ కట్టడం అని యనమలకు తెలియదా? అని ప్రశ్నించారు.

అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

అంతకుముందు, 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చేస్తారా? అంటూ యనమల వ్యాఖ్యానించడంపైనా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బదులిచ్చారు.

పోలవరం అక్రమ ప్రాజక్టు కాదన్న విషయాన్ని యనమల తెలుసుకోవాలని హితవు పలికారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?