అనంతపురం జిల్లాకు కొత్త పోలీసు బాస్
అనంతపురం : జిల్లాకు కొత్త పోలీసు బాస్(ఎస్పీ) బూసారపు సత్యఏసుబాబు విచ్చేశారు. విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చి..
అ క్కడి నుంచి రోడ్డుమార్గాన శనివారం రాత్రికి నగరానికి చేరుకున్నారు.
స్థానిక పోలీసు కాంప్లెక్స్‌లోని విశ్రాంత భవనంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
అనంతరం పోలీసు క్యాంపు కార్యాలయంలో ప్రస్తుత జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను కలిశారు.
ఇద్దరూ కాసేపు జిల్లా తాజా పరిస్థితులు, శాంతిభద్రతలు తదితర అ ంశాలపై చర్చించుకున్నారు.
జిల్లాకు కొత్త ఎస్పీ విచ్చేయడంతో జిల్లా పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.
*నేడు బాధ్యతల స్వీకరణ* జిల్లా నూతన ఎస్పీగా బూసారపు సత్యఏసుబాబు ఆదివారం ఉదయం 11:30గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రకాశం జిల్లా గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం రెండురోజుల క్రితం జిల్లా ఎస్పీగా బదిలీచేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదివారం రిలీవ్ కానున్నారు.
కొత్త ఎస్పీకి ఆయన బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇంటెలిజెన్స్ ఎస్పీగా అశోక్‌కుమార్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు
Comments
Post a Comment