భారత్‌కు హార్మూజ్ భయం
న్యూఢిల్లీ: భారత్‌కు హార్మూజ్ భయం పట్టుకున్నది.
దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి.
ఇవన్నీ కూడా హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి.
అలాంటి ఈ జలసంధిపై చోటుచేసుకున్న దాడి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది. ఆ దారి సురక్షితంగా లేకపోవడం వణికిస్తున్నది.
ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. తాజా దాడుల ప్రభావం కూడా మార్కెట్‌పై కనిపిస్తున్నది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్‌ల్ ధర రూ.74.32 వద్ద, డీజిల్ ధర రూ.69.51 వద్ద ఉన్నాయి.
ఈ క్రమంలో హార్మూజ్ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ముడి చమురు దిగుమతులు జరిగితే ఖర్చులు పెరుగక తప్పదు.
ఇదే జరిగితే ధరలు విజృంభించడం ఖాయం. అంతేగాక ద్రవ్యోల్బణం కోరలు చాచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచడం, నిత్యవసర ధరలూ పెరిగిపోవడం, రూపాయి క్షీణత, వృద్ధిరేటు పతనం వెంటవెంటనే జరిగిపోతాయి.
ఫలితంగా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది.
Comments
Post a Comment