బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది.

న్యూఢిల్లీ: 

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో పార్టీ నేతగా వ్యవహరిస్తారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గా నియమితులయ్యారు.

రాజ్యసభలో అధికార పక్ష నేతగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ నియమితులయ్యారు.

ఇంతకుముందు వరకు బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో, సీనియర్‌ పార్లమెంటేరియన్‌, బీజేపీ దళిత నేత తావర్‌చంద్‌కు అవకాశం కల్పించారు.

ఇక రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రైల్వేలు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు.

ఆయన కేంద్ర మంత్రి కాకమునుపు బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

కాగా, లోక్‌సభలో అధికార పార్టీ చీఫ్ విప్‌గా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.
కర్ణాటకలోని ధార్వాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ ఎంపీగా ప్రహ్లాద్ జోషి ఉన్నారు.

లోక్‌సభలో ప్ఱభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను నియమితులయ్యారు.

ఇక, రాజ్యసభలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా వీ.మురళీధరన్, లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్‌గా డాక్టర్ సంజయ్ జైశ్వాల్, రాజ్యసభలో చీఫ్‌ విప్‌గా నారాయణ్ లాల్ పంచారియా వ్యవహరిస్తారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?