ఇంక్యూబేషన్ హబ్ గా వైజాగ్ : మంత్రి మేకపాటి

వైజాగ్ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖా మాత్యుల శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నేడు వైజాగ్ లోని టెక్ మహేంద్ర భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో  టెక్ స్టార్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ అమరావతి వద్ద పెద్ద పారిశ్రామికదారులను ఆహ్వనించి పరిశ్రమలను స్థాపన, సెమీ అర్బన్ ఏరియాలు అయిన మంగళగిరి, రాజమండ్రి, తిరుపతి లలో బీపీఓ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయుట గురించి చర్చించారు.

పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి త్వరలో పరిశ్రమలు స్థాపిస్తామని తెలిపారు.

"మంత్రితో  ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్  ఇన్సిస్టిమెంట్ ప్రతినిధుల భేటీ"

వైజాగ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్సిస్టిమెంట్ కు సంబంధించిన ప్రతినిధులు బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీస్ మరియు ఇన్నోవేషన్ క్రింద అకాడమి, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు స్థలమును కేటాయించవలసినదిగా కోరారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు, మార్కెటింగ్ వసతుల కల్పన జరుగుతుందని ఈ భేటిలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు..

స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్విస్టిమెంట్ వారు వైజాగ్ లో అకాడమి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా వసతులు కల్పిస్తామని,

యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి అనూప్ సింగ్, టెక్ స్టార్ ప్రెసిడెంట్ బాల గిరీష్ బల్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్విస్టిమెంట్ ప్రతినిధులు జెన్నీఫర్ ఎం జాన్సన్, టిఫెనీ టీ హాంగ్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?