‘క‌ల్కి’ క‌థ నాది.. రాజ‌శేఖ‌ర్ మోసం చేసాడు.. ర‌చ‌యిత ఆవేద‌న‌..

గరుడ వేగ సినిమాతో రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ఉన్నాను అని నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సాధించ‌క‌పోయినా కూడా గుర్తింపు అయితే వ‌చ్చింది. మ‌ళ్లీ రాజ‌శేఖ‌ర్ సినిమాలు చేయొచ్చు.. ఆయ‌న చేస్తే ప్రేక్ష‌కులు ఇంకా చూస్తున్నారు అనే ఓ న‌మ్మ‌కం అయితే క‌నిపించింది. ఇదే న‌మ్మ‌కంతో ఇప్పుడు భారీ బ‌డ్జెట్ పెట్టి మ‌రీ క‌ల్కి సినిమా చేస్తున్నాడు రాజ‌శేఖ‌ర్. గ‌తేడాది నాని నిర్మాణంలో అ! లాంటి భిన్న‌మైన సినిమా తెర‌కెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇందులో రాజశేఖర్ స‌ర‌స‌న హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శ‌ర్మ న‌టిస్తుంది.

ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు టీజ‌ర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవ‌డంతో సినిమా కూడా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు రాజ‌శేఖ‌ర్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశం.. దానికి తోడు 1983 నేప‌థ్యం ఈ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కు ముందే కాపీ చిక్కుల్లో ప‌డిపోయింది. కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రైట‌ర్ ఒక‌రు ప‌దేళ్ల కిందే మ‌హంకాళి సినిమా చేస్తున్నపుడు ఈ స్క్రిప్ట్ తాను రాజ‌శేఖ‌ర్ చేతికి ఇచ్చాన‌ని చెబుతున్నాడు.

అప్పుడు ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువవుతుంది.. అంత పెట్ట‌డం క‌ష్ట‌మే.. త‌ర్వాత చూద్దామ‌ని ఆపేసాడ‌ని.. అయితే అదే క‌థ‌ను ఇప్పుడు క‌ల్కిగా తీసాడంటున్నారు ప్ర‌సాద్. దీనిపై ఇప్ప‌టికే రైటర్స్ అసోసియేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానంటున్నాడు ఈయ‌న‌. త‌న‌కు డ‌బ్బులు కూడా అస‌వ‌రం లేద‌ని.. కేవ‌లం క్రెడిట్ ఇస్తే చాల‌ని కోరుకుంటున్నాడు. మ‌రి మ‌రో వారం రోజుల్లో సినిమా విడుద‌ల కానున్న ఈ త‌రుణంలో ఈ వివాదం నుంచి క‌ల్కి ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?