వీళ్లు మామూలోళ్లు కాదు.. ఒకే కారుని అమ్మడం.. కొట్టేయడం.. మళ్లీ అమ్మడం..

తమిళనాడులో ఓ ఘరానా దొంగల బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారు చేసిన పని చూసి పోలీసులు షాక్‌కి గురయ్యారు. ఒకే కారుని అమ్మారు. మళ్లీ దాన్ని కొట్టేశారు. ఆ తర్వాత మరొకరికి అమ్మారు. అలా.. మూడుసార్లు చేశారు. అయితే, చివరకు వారి పాపం పండింది. ఐదుగురు గ్యాంగ్‌లో ఇద్దరు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కనత్తూర్‌తో తంగై అని ఓ సినీ నిర్మాత తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కాల్ డేటాను పరిశీలించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేశారు. అందులో ఉన్న ఇద్దరిని చూసి బాధితుడు తంగై గుర్తుపట్టాడు. దీంతో అసలు విషయం బయటపడింది. కారు కొనుక్కోవాలనుకున్న తంగై.. ఓ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటన చూశాడు. ఆ తర్వాత జూన్ 7న వారిని కలిశాడు. కారు నచ్చడంతో డీల్ ఓకే అయింది. రూ.6లక్షలకు కారు కొనుక్కున్నాడు.కట్ చేస్తే, మూడు రోజుల తర్వాత జూన్ 10న తంగై కొనుక్కున్న కారు పోయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటపడ్డాయి. వారు ఈ కారును మరో ముగ్గురికి విక్రయించి.. వారి నుంచి కూడా కొట్టేశారని అంగీకరించారు. కారు అమ్మేటప్పుడు అందులో సీక్రెట్‌గా జీపీఎస్ పరికరాన్ని ఫిక్స్ చేస్తారు. దీంతో పాటు డూప్లికేట్ కారు తాళాలు కూడా తమ వద్ద ఉంచుకుంటారు. కారు ఎక్కడున్నా వారికి తెలిసిపోతుంది. తాళాలు కూడా వారివద్దే ఉంటాయి కాబట్టి, అర్ధరాత్రి పూట మళ్లీ కారు కొట్టేస్తారు. నిందితుల వద్ద ఇలాంటి పది కార్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?