భారత ప్రధాని మోదీ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రజాదరణ పొందారు.
లండన్:
ఆయనను ప్రపంచ శక్తిమంతుడైన నేతగా బ్రిటీష్ హెరాల్డ్ పత్రిక పాఠకులు ఎంపిక చేశారు.
ఆ మేగజైన్ నిర్వహించిన సర్వేలో మోదీకి అత్యధికంగా 30.9ు ఓట్లు పోలయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్(29.9ు), అమెరికా అధ్యక్షుడు ట్రంప్(21.9ు), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(18.1ు)లను ఆయన వెనక్కి నెట్టారు.
రీడర్స్ పోల్‌కు 25 మందికి పైగా నేతలను నామినేట్ చేయగా తుది రౌండ్‌కు మోదీ, పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్‌లను నిపుణుల కమిటీ ఎంపిక చేసింది.
బ్రిటీష్ హెరాల్డ్ పాఠకులు తొలిసారి ఓటీపీ ఆధారంగా ఓటింగ్ చేశారు.
ఈ పత్రిక జూలై 15న తాజా సంచికను ప్రధాని మోదీ ముఖ చిత్రంతో వెలువరించనుంది.
Comments
Post a Comment