కడప జిల్లాలో దారుణం

కడప: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిద్దవటం మండలం దగ్గర పెన్నానది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది. అయితే వారు ట్రాక్టర్‌ను ఆపకుండా రెవెన్యూ సిబ్బందిని ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో వీఆర్‌వో, వీఆర్‌ఏలకు గాయాలయ్యాయి. అయితే సిబ్బందిని ఢీ కొట్టి అధిక స్పీడ్‌తో వెళ్తూ ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?