ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద రహదారుల విస్తరణకు పురపాలక, ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు చేపట్టారు.
తాడేపల్లి
ప్రస్తుతం ఉన్న రహదారిని మూడు అడుగులకు విస్తరిస్తున్నారు.
రహదారి నిర్మాణానికి ముందుగా భూగర్భ డ్రైనేజీకి పైపులైన్ వేశారు.
భారతమాత కూడలి నుంచి కీర్తిఎస్టేట్ వరకు విస్తరణ పనులు చేపట్టారు.
నివాసితులకు, రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రహదారి విస్తరణ పనులు చేపట్టారు.
మరో పక్క కృష్ణాపశ్చిమ కాలువకట్ట విస్తరణ కూడా చేపట్టారు.
కట్టమీద ఉన్న ఇళ్ల మధ్య నుంచి ర్యాంప్ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి ఇంటికి వచ్చే సందర్శకులు కీర్తి ఎస్టేట్ వరకు వెళ్లకుండానే నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాంపు మీదుగా సీఎం ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు
Comments
Post a Comment