నీటి సంక్షోభంపై రేపు సమావేశం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోతుండటం, పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులతో కేంద్రం చర్చలు జరపనుంది.
ఇందుకు సంబంధించి ఈనెల 11న సమావేశం ఏర్పాటు చేసింది. నీటి నిల్వ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించనుంది.
కేంద్రం జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో సంక్షోభాన్ని అధిగమించేందుకు సహకరించాల్సిందిగా రాష్ట్ర మంత్రులను ఆయన కోరనున్నారు.
నీటి అంశం అనేది ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో సంక్షోభ సమయాల్లో కేంద్రం చేసేది పెద్దగా ఏమీ ఉండదు.
అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తిన ప్పుడు తగిన సహకారం అందించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం నెరుపుతుంది.
కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తాజాగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రధాన ఎజెండా నీటి నిల్వల అంశమే అయినప్పటికీ, సమావేశానికి సమయం తక్కువగా ఉండటంతో అన్ని రాష్ట్రాల మంత్రులు హాజరవుతారా లేదా అనే దానిపై అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది.
Comments
Post a Comment