చెన్నైలో పోకిరీ విద్యార్థుల వీరంగం.. కదులుతున్న బస్సుపై ఇలా..

చెన్నైలోని కాలేజీల్లో బస్సు డే వేడుకల సందర్భంగా విద్యార్థులు బస్సుల పైకి ఎక్కి ప్రమాదకర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.అది ప్రమాదమని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు.తాజాగా చెన్నైలోని పచ్చయప్పా కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా అదే పని చేశారు. దాదాపు 50మంది విద్యార్థులు కాలేజీ బస్సు పైకి ఎక్కి బస్సు డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కదులుతున్న బస్సుపైనే విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో చాలామంది కిందపడిపోయారు. వీరిలో పలువురు గాయాలపాలయ్యారు. నలుగురు విద్యార్థులను పోలీసులుఅదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?