కాటేసిన 'కులం' : పెళ్లయి కొద్ది గంటలు కూడా గడవకముందే ఘోరం..

తమిళనాడులో దారుణం జరిగింది. దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఓ యువకుడిని సోదరుడే హతమార్చాడు. పెళ్లయి కొద్ది గంటలు కూడా గడవకముందే అతని హత్య జరగడం గమనార్హం. కోయంబత్తూర్ జిల్లా మెట్టుపాలాయంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని కనకన్‌గా స్థానిక పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కనకన్(22),దర్శని ప్రియ(18) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.కనకన్ గౌండర్ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా.. ప్రియ దళిత సామాజిక వర్గానికి యువతి. దీంతో కనకన్ ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయిన ఇద్దరు మంగళవారం మెట్టుపాలాయంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.పెళ్లయి కొద్ది గంటలు కూడా గడవకముందే ఓ గ్యాంగ్ కత్తులతో వీరిపై దాడికి పాల్పడింది.దాడిలో కనకన్ అక్కడికక్కడే మృతి చెందగా యువతి తీవ్ర గాయాలైనట్టు సమాచారం.కనకన్ మృతదేహాన్ని కోయంబత్తూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కనకన్ హత్యలో అతని సోదరుడి హస్తమే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?