బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్
మొన్న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... తెలుగుదేశం పార్టీని ఇంతలా ముంచేస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. రీసెంట్‌గా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకొని బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మొన్నటి వరకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. వీళ్లు ఈ రకంగా పార్టీ మారతారని తెలుగు దేశం శ్రేణులు కూడా ఊహించలేకపోయాయి. అది మరక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత... అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకొని కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా బీజేపీలో చేేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కాషాయ పార్టీలో చేరిన సుజనా చౌదరి..టీడీపీలో ఉన్న నేతలను ఒక్కొక్కరిగా బీజేపీలో చేర్పించేందుకు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు.
గతంలో వల్లభనేని వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ వంటి సినిమాను నిర్మించాడు. అంతేకాదు రవితేజతో ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్నినిర్మించాడు. గతంలో 2009లో విజయవాడ ఎంపీగా లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత 2014, తాజాగా 2019లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికయ్యారు. మొత్తానికి తెలుగు దేశం పార్టీకి అండగా ఉంటున్న సామాజిక వర్గ నేతలే ఒక్కొక్కరుగా సైకిల్ ను వీడడం టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో ఇక టీడీపీ పనైపోయిందని భావిస్తున్న వీళ్లంత.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుతున్నారని సమాచారం.
Comments
Post a Comment