కాకినాడలోని గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

కాకినాడ:

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మంగళవారం అర్ధరాత్రి దాటాక గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి.

మూడు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి.

దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలార్పుతున్నారు.

మంటల తీవ్రత చేయిదాటిపోవడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.

భవనం ఇరుకు ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టు పక్కలకు వెళ్లే వీలు లేకుండా ఉందని, ముందు నుంచే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు.

భవనంలో ప్లాస్టిక్‌, స్కూల్‌ బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?