వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి

వజ్రకరూర్‌ : ప్రతి సంవత్సరం జూన్‌ ప్రారంభంలో అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్‌ మండలంలోని గ్రామాలకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. జూన్‌లో వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారమే దీనికి కారణం. ఈ ప్రచారం మిగిలిన జిల్లాలకు వ్యాపించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ప్రజలు వజ్రకరూర్‌కు తరలివస్తున్నారు. పొలాల్లో అణువణువు అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా వజ్రం దొరక్కపోతుందా.. అదృష్టం పండకపోతుందా అనుకుంటూ వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. చిన్న వజ్రం దొరికినా చాలనుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపు లేకుండా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ రాగా.. మరికొందరు స్నేహితులను వెంట తెచ్చుకుని పొలాల్లో వెతుకుతున్నారు. సమయాన్ని వృథా చేయడమేందుకని చెట్ల కిందే కూర్చుని భోజనాలు సైతం ఆరగిస్తున్నారు.వజ్రాల కోసం రాయలసీమ నుంచే కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల జనం వస్తుంటారని ఇక్కడికి రైతులు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?