మహిళా జర్నలిస్టుపై కోడిగుడ్లతో దాడి.. ఆ తర్వాత కాల్పులు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా జర్నిలిస్టుపై జరిగిన దాడి కలకలం రేపింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టు కారులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నోయిడాకు చెందిన మిథాలీ చందోలా ఓ మీడియా సంస్థలో పనిచేస్తోంది. శనివారం డ్యూటీ ముగించుకుని అర్థరాత్రి 12.30 గంటల సమయంలో హ్యుందాయ్ కారులో ఇంటికి బయలుదేరింది. ఆమె కారును మరో షిఫ్ట్ కారు ఫాలో అయ్యింది. ఒక్కసారిగా మిథాలీ కారుపై షిఫ్ట్ కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు విసిరారు. దీంతో కాంగారు పడిన ఆమె కారు ఆపకుండానే... డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఒక్కసారిగా ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరారయ్యారు. ఒక బులెట్ మిథాలి చేతికి తగలడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్ ఢిల్లీలోని ధర్మశిల హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు మిథాలీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిథాలీపై కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక బైక్‌లపై వెళ్లే వారిపై గుడ్లు విసిరి దోపిడీకి పాల్పడే ముఠాల హస్తం ఉందా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత కక్షతో దుండగులు దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?