పెరిగిన కేబుల్ ధరలపై దృష్టిపెట్టిన ట్రాయ్
ఈ ఏడాది జనవరి నుంచి రెండు మూడు నెలల పాటు టీవీ ఛానెళ్ల విషయంలో నెలకొన్న గందరగోళం అంతా ఇంతా కాదు. ఇందుకు కారణం... ఛానెళ్ల ఎంపిక విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI చేసిన మార్పులే. వినియోగదారులు తాము చూసే ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే చాలన్న విధానంతో ట్రాయ్ అమలు చేసిన కొత్త నిబంధనలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. కొంతకాలం గడువు పెంచినా ట్రాయ్ మాత్రం నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అమలు చేసింది. డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అయితే ట్రాయ్ కొత్త నిబంధనలతో వినియోగదారులు నెలకు చెల్లించాల్సిన కేబుల్, డీటీహెచ్ బిల్లులు పెరిగాయి. దీంతో టీవీ టారిఫ్ ఆర్డర్‌పై దృష్టిపెట్టి సబ్‌స్క్రిప్షన్ ధరల్ని నియంత్రించాలన్న నిర్ణయానికి వచ్చింది ట్రాయ్.
వినియోగదారుల మేలు కోసం ట్రాయ్ కొత్త నిబంధనలు అమలు చేసినా... కేబుల్ ధరలు పెరగడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ట్రాయ్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది ట్రాయ్. కొత్త టారిఫ్ విధానంలో ఏవైనా ఉల్లంఘనలు జరిగాయా అని విచారణ జరపబోతోంది ట్రాయ్. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్‌కు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సరికొత్త టారిఫ్ విధానంతో టారిఫ్ పెరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న ట్రాయ్... కొన్ని మార్పులు చేసే దిశగా ఆలోచిస్తోంది.
Comments
Post a Comment