మరో ఘోరం..నాలుగేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారం

దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో 9 నెలల చిన్నారిని రేప్‌చేసి హతమార్చిన దారుణాన్ని మరవక ముందే.. ఉత్తరాఖండ్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. డెహ్రాడూన్‌లోని నలపాని ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

తల్లిదండ్రులు పని నుంచి ఇంటికి రాగానే..బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. పాప పరిస్థితి చూసిబోరున విలపించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఆమెపై రేప్ జరిగినట్లు నిర్ధారించారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?