ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చేస్తున్నట్లు సీఎం భద్రతా అధికారులు వెల్లడించారు. కొత్తగా కాన్వాయ్ లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలను ఏర్పాటు చేశారు. AP39 PA 2345 నెంబర్‌తో కొత్త వాహన శ్రేణిలో ఉంటుందని అధికారులు తెలిపారు. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్ పంపడంతో కొత్త వాటిని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్‌లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్ నేమ్ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment