బ్యాంకులపై ఫిర్యాదు .... ఆర్బీఐ సైట్లో అప్లికేషన్

బ్యాంకులపై మీరేమైనా ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు.

దాని కోసం ఆర్బీఐ ఓ అప్లికేషన్‌ తయారు చేసింది. ఇక నుంచి మీరు మీ సమస్యలను ఆ సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

కంప్లేయింట్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌(సీఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ఆవిష్కరించారు.

ఈ అప్లికేషన్‌ ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఫిర్యాదు నమోదు చేయగానే.. ఆటోమెటిక్‌గా అక్నాలెజ్మెంట్‌ వస్తుంది.

దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వినిపించారు.

ఫిర్యాదుల స్టాటస్‌ తెలుసుకోవడానికి ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?