గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురు అరెస్ట్.. బాలికను పరామర్శించిన మంత్రి!
ప్రకాశం : ఒంగోలులో 16 ఏళ్ల బాలికను వారం రోజులుగా బంధించి నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
బాధితురాలు ఫిర్యాదుతో దుండుగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతోంది.
ఇదిలా ఉంటే.. అత్యాచారానికి గురైన బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు.
ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. హోంమంత్రి కూడా ఘటనకు సంబంధించిన పూర్తి పూర్వాపరాలను తెలుసుకున్నారని మంత్రి మీడియాకు వివరించారు.
నిందితులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని హోం మంత్రి ఆదేశించారన్నారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్నీ విధాలుగా అండగా ఉంటామని బాలినేని ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Post a Comment