తెలంగాణ బీజేపీలోకి బాహుబలి వస్తారట.. మరి ఎవరా నేత?

పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకొన్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా నాలుగు లోక్ సభ సీట్లను గెలుచుకొంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం తమ పార్టీయేనని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో చేరికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు మల్టీ కలర్ సినిమా ముందుందని ఆ పార్టీ లక్ష్మణ్ అంటున్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరతారని చెప్పారు. జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కాబోతోందని, ఆ సందర్భంగా చేరికలు ఉధృతమవుతాయని అన్నారు. కనీసం 5 లక్షల సభ్యత్వాలను అదనంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాకే మీ పార్టీలోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. నిబంధనలకు సాంకేతికత, నైతికత అడ్డుగా ఉండవన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తారు.. లేదా నిబంధనలకు లోబడి చేరుతారు అని పేర్కొన్నారు. కాగా, మున్ముందు చాలా మంది బాహుబలులు బీజేపీలో చేరతారని లక్ష్మణ్ చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?