నవరత్నాల్లో భాగంగా పేదవారి సొంతింటి కలను
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు పెనుమంట్ర మండలం గర్వులో ప్రవాస భారతీయ మహిళ పడాల కస్తూరి 1.10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉండొచ్చునని అంచనా. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రోద్బలంతో ఈ భూమిని అందించాలని ఆమె నిర్ణయించారు. లండన్ నుంచి వచ్చిన కస్తూరిని మంత్రి అభినందించారు.
Comments
Post a Comment