ఆదివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ కాల్పులు
శ్రీనగర్:
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా ధరమ్‌డోర కీగం ఏరియాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతంలో ఇంకెవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనేది నిర్ధారించేందుకు బలగాలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నాయి.
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులను గుర్తించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ), 33వ రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ నిర్వహించాయి.
Comments
Post a Comment