జోష్‌లో కోహ్లీ సేన
పసికూన అఫ్ఘాన్‌తో మ్యాచ్ నేడు
బరిలోకి పేసర్ షమి
విజయ్ శంకర్ అనుమానమే!
వరుస విజయాలతో టీమిండియా ఓవైపు.. ఆడిన ఐదింటిలోనూ ఓడిన అఫ్ఘానిస్థాన్ మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లతో కూడిన కోహ్లీ సేనతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ అఫ్ఘాన్‌ది వెనుకడుగే.. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందో చెప్పాల్సిన పనిలేదు.
అయినా మెరుపు ఆటను ప్రదర్శిస్తూ తమ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకునేందుకు కోహ్లీ సేన ఈ మ్యాచ్‌ను వాడుకోవాలనుకుంటోంది.
టోర్నీ సాగుతున్న కొద్దీ భారత్‌కు గాయాల బెడద తీవ్రమవుతున్నా తమ అమ్ముల పొదిలో మిగిలిన అస్త్రాలు కూడా పదునుగానే ఉండడం జట్టుకు సానుకూలాంశం.
అటు ఇయాన్ మోర్గాన్ ఊచకోత నుంచి అఫ్ఘాన్ ఇంకా కోలుకోలేదు.
అలాగే తురుపు ముక్క రషీద్ ఖాన్ పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును మరింత దెబ్బతీస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్‌కు ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి.
Comments
Post a Comment