పాక్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

ఇస్లామాబాద్: నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని అక్కడి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.30 మిలియన్లను జర్దారీ స్వీకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

నకిలీ బ్యాంకు ఖాతాల కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా కోర్టు దాన్ని తిరస్కరించడంతో అరెస్ట్ చేశారు.

ఈ కేసులో జర్దారీ సోదరి ఫర్యాల్ తల్పూర్ సహ నిందితురాలిగా ఉన్నారు. ఆయన అరెస్ట్‌కు ఆదివారమే వారెంట్ జారీ చేయగా..

తల్పూర్‌పై ఎలాంటి వారెంట్ ఇవ్వలేదు. దేశ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు మాజీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు.

వీరిద్ద‌రికి చెందిన కంపెనీలు ఫేక్‌ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.4.4 బిలియ‌న్ల‌ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎలాంటి ఆందోళనలు చేయవద్దని ఆసిఫ్ తనయుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?