ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి కి లేఖ రాసిన సిపిఐ కె రామకృష్ణ
ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
పార్లమెంటులో 25 మంది ఎంపీలుంటే ఎపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ప్రజలు నమ్మి 22 మంది ఎంపీలను అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్ సభలో లిఖితపూర్వకంగా చెప్పారు.
5 ఏళ్లపాటు ప్రత్యేక హోదా వస్తుందనే ఆశతో ప్రజలు మోసపోయారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి.
అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నాం.
- రామకృష్ణ.
Comments
Post a Comment