సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్
హైదరాబాద్ : తెరాస శాసనసభాపక్షంలో సీఎల్పీ విలీనాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
స్పీకర్ జారీ చేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వులను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను.. తెరాస శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎల్పీ తీర్మానం లేకుండానే.. 12 మంది ఎమ్మెల్యేలు కోరడం.. స్పీకర్ దాన్ని యథాతథంగా ఆమోదించడం చట్టబద్ధంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేయాలని వారు కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ అంశంపై రేపు విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.
Comments
Post a Comment