నేడు ఎంసెట్‌ ఫలితాలు

అమరావతి : ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, మండలి ఛైర్మన్‌ ఎస్‌ విజయరాజు ఉదయం 11.30 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

నెల రోజుల క్రితమే విడుదల కావాల్సిన ఫలితాలు తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఆలస్యమయ్యాయి.

ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఎంసెట్‌-2019 పరీక్షకు 2,82,633 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇంజనీరింగ్‌కు 1,95,723 దరఖాస్తు చేసుకోగా 1,95,908 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌కు 86,910 మంది దరఖాస్తు చేసుకోగా 81,916 మంది పరీక్షకు హాజరయ్యారు.

మొత్తం 115 పరీక్ష కేంద్రాల్లో ఉన్నత విద్యామండలి ఈ పరీక్ష నిర్వహించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?