పోలవరం పనులు ఆపొద్దు... జగన్‌ను కోరిన మాజీ మంత్రి దేవినేని
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కర్నూలు జలదీక్షలో జగన్ మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. పోలవరం పై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు దేవినేని. పోలవరంలో కన్నా కాళేశ్వరం లోనే జగన్ ఎక్కువసేపు గడిపారంటూ విమర్శలు చేశారు. ఆ నాడు ప్రతిపక్షoలో ఉన్న జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడారో..ఓ సారి నెమరువేసుకుంటే మంచిదన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. అందరి నిర్ణయాలు తీసుకుని కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారన్నారు. అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని కూడా 60 శాతం పైగానే పూర్తి అయ్యాయిని తెలిపారు. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని మన భూభాగం లో కలపబట్టి పోలవరం కల సాకారం అయిందన్నారు.
మామీద కోపంతోనో ఇంకెవరిమీద కోపంతోనో పోలవరం పనులు ఆపొద్దుని జగన్‌ను హితవు పలికారు దేవినేని. 16 జాతీయ ప్రాజెక్ట్ లలో పొలవరాన్ని ఎప్పుడు ఎలా పూర్తి చేయబోతున్నారో అప్పటి కేంద్ర మంత్రి చెప్పటం జరిగిందన్నారు. 16 వేల కోట్ల ప్రాజెక్ట్ 55 వేల కోట్లకు పెంచామని దాని మీద ఆడిట్ చేస్తామంటున్నారు. నిస్వార్థంగా పోలవరం పనులు చేసామన్నారు. ఏ ఆడిట్ వేసుకున్నా తమయు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఉమా. జలదీక్షలో మీరు కాళేశ్వరం గురించి అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ప్రజలకి వివరణ ఇవ్వాలన్నారు.గవర్నర్ ప్రసంగం లో ఎక్కడ నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదన్నారు.అనంతపురంలో నీరు ఉండబట్టి కీయా మోటార్స్ వచ్చిందన్నారు దేవినేని.నిర్మాణ పనులు అన్ని అక్కడే ఉన్నాయన్నారు. చరిత్రని ఎవరూ తిప్పి రాయలేరన్నారు.
Comments
Post a Comment