తమ బంధానికి అడ్డొస్తున్నాడని వదినతో కలిసి అన్నను హత్య చేసిన సోదరుడు...
వివాహేతర సంబంధం కారణంగా రక్త సంబంధం మరిచిపోయి సొంత అన్ననే కడతేర్చాడు ఓ కసాయి సోదరుడు. తమిళనాడులోని శివగంగై జిల్లా ఎస్. పుదూర్ గ్రామంలో వంతెన కింద మురుగయ్య అనే వ్యక్తి మృతదేహం లభించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా, మృతుడి సోదరుడే హంతకుడుని తేలింది. వివరాల్లోకి వెళితే మృతుడు మురుగయ్య గ్రామంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య మణితో కలిసి వలసైపట్టి గ్రామంలో నివాసముంటున్నాడు. అయితే అదే గ్రామానికి మురుగయ్య సోదరుడు పిచ్చయ్య, తరచూ అన్న ఇంటికి వస్తుండేవాడు. ఆ క్రమంలోనే అన్న భార్య మణిపై పిచ్చయ్య కన్నేశాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండటంతో వారిమధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అన్న ఊరిలో లేని సమయంలో వదినతో పిచ్చయ్య శారీరక సంబంధం కొనసాగించేవాడు.అయితే ఈ విషయం అన్న మరుగయ్యకు తెలియడంతో భార్యను మందలించాడు. అలాగే పిచ్చయ్యను కూడా హెచ్చరించాడు. దీంతో తమ ఇద్దరి మధ్య సంబంధానికి మురుగయ్యే అడ్డుగా ఉన్నాడని అనుకున్న భావించి వదిన, మరిది కలిసి మురుగయ్యను హత్య చేశారు. అనంతరం మురుగయ్య శవాన్ని ఊరు చివర ఉన్న వంతెన కింద పారేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చేసిన హత్యగా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సాక్ష్యాల సేకరించిగా కట్టుకున్న భార్య మణి, సొంత తమ్ముడు పిచ్చయ్యలే అసలు హంతకులని తేలింది.
Comments
Post a Comment