మెగాస్టార్‌ను ముందుంచి... ఏపీలో బీజేపీ ప్లాన్
ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జోరుగా పార్టీల ఫిరాయింపులు జరుగుతున్నాయి. మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి..త్వరలో బీజేపీలోకి వెళ్తారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒకవేళ పార్టీలోకి వస్తే.. ఆయనకు ఎలాంటి స్థానం కల్పిస్తారన్న అంశంపై కూడా ఔత్సాహికులు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. బీజేపీ అఢ్యక్షుడు ఉన్న కన్నా లక్ష్మి నారాయణ కాపు సామజిక వర్గానికి చెందిన నేత అయన గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నాను ఆంధ్రాలో బీజేపీకి వైభవం తేగలరన్న నమ్మకంతో ఆయనను బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ కన్నాను సొంత సామాజికవర్గమే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆదరించలేదు. అంతేకాక బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కించుకోక పోవటంతో బీజేపీ అధిష్టానం ఆంధ్రాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా నిలబెట్టేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
అందుకే చరిష్మా ఉన్న నేతల వేటలో పడింది కమలం పార్టీ. అందుకే ఏపీలో బలపడేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కమలనాథులు తెలివిగా వాడుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి నేతలకు గాలమేసి తమ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా ఆంధ్రాలో బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతలే ధీమా వ్యక్తంచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా చిరంజీవిని కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. చిరు తమ పార్టీలో చేరితే ఆయన్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం.
దీంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి.. దాన్ని కాంగ్రెస్ విలీనం చేసిన ఆయన తర్వాత చిరు రాజకీయాల్లో ఇమడలేకపోయారు. దీంతో పాలిటిక్స్‌కు దూరమైన ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన సైరా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తారని భావించలేం. కానీ చిరంజీవిని మాత్రం మళ్లీ రాజకీయాల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని కాషాయ పార్టీ అంచనాలు వేస్తోంది. ఏపీలో 25 శాతానికిపైగా ఉన్న ఈ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీనే విజయం వరిస్తుంది. అదీగాకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో చిరంజీవికి బీజేపీ నేతలు ఆహ్వానం పంపుతున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం
Comments
Post a Comment