ఏపీలో రేషన్ బియ్యం ఇక డోర్ డెలివరి

ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాలకి వెళ్లాల్సిన పనిలేదు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని  ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?