సంచలన నిర్ణయం ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి..

ఇకపై రాజకీయాలు చేయబోనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించారు.

కొద్ది రోజులుగా తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు నిరాధారం అని ఖండించారు.

తాను ఏ పార్టీలోనూ చేరడం లేని జేసీ స్పష్టం చేశారు.

‘‘జగన్‌ను నేను ఏనాడూ ద్వేషించలేదు.

జగన్ మావాడే.. నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ మంచి పరిపాలన అందిస్తారని ఆశిద్దాం’’ అని వ్యాఖ్యానించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చిన్న చిన్న గొడవలు సహజమేనని అన్నారు.

పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జేసీ కితాబిచ్చారు.

ప్రధాని మోదీతో జగన్ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామం అని ప్రశంసించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?