దోమల బారినుంచి రక్షించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం

విజయవాడ వాసుల్ని దోమల బారినుంచి రక్షించేందుకు స్థానిక నగరపాలక సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ఏ ప్రాంతంలో ప్రస్తుతం దోమలు అధికంగా ఉన్నాయి.. అవి ఏ రకానికి చెందినవి.. వంటి అంశాలను పసిగట్టేందుకు ‘మస్కిటో డివైజెస్‌ ప్రాజెక్టు’ను వీఎంసీ ప్రారంభించింది. ఇందుకు యంత్రాలను ట్రాకిట్‌నౌ టెక్నాలజీ సంస్థ సహకారంతో పది చోట్ల ఏర్పాటు చేశారు. దోమల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బిగించి.. వాటిని ఆకర్షించేలా సువాసన కలిగిన ద్రవాన్ని యంత్రాల్లో ఉంచుతున్నారు. ఇవి కొద్దిపాటి విద్యుత్తు వినియోగంతో 24 గంటలూ పనిచేస్తాయి. ఆ యంత్రాల్లో అమర్చిన చిప్‌ ఆధారంగా.. ఆయా ప్రాంతాల్లో దోమల ప్రభావాన్ని పసిగడతారు. అనంతరం ఆ వివరాలు ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) వంటి సాంకేతికతతో సిగ్నళ్ల ద్వారా సెల్‌టవర్‌కు, ఆపై క్లౌడ్‌ డేటాబేస్‌కు చేరతాయి. తద్వారా అంతర్జాలం సాయంతో మస్కిటో డివైజెస్‌ ఉన్న ప్రాంతాల్లోని దోమల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుకలుగుతుంది. అనంతరం వాటి నియంత్రణకు వీఎంసీ అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?