పోలీసులకు వారాంతపు సెలవులు అమలుపై జి.పో.అ.సం. అడహక్ కమిటీ హర్షం

*పోలీసులకు వారాంతపు సెలవులు అమలుపై జి.పో.అ.సం. అడహక్ కమిటీ హర్షం*

-  రాష్ట్ర ముఖ్యమంత్రి, డి.జి.పి, ఇతర ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన సాకే త్రిలోక్ నాథ్

  అనంతపురం:      పని ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్న పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించడంపై జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ మరియు ఇతర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుంచి పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతాయని రాష్ట్ర డి.జి.పి దామోదర గౌతం సవాంగ్ ప్రకటించారని అడహక్ కమిటీ సభ్యుడు సాకే త్రిలోక్ నాథ్ తెలిపారు.

ఎన్నో సంవత్సరాల నుండీ వేచి చూస్తున్న పోలీసుల కల సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి , రాష్ట్ర డి.జి.పి దామోదర గౌతం సవాంగ్ , కమిటీలో ఉన్న అందరు ఉన్నతాధికారులకు ఆయన జిల్లా పోలీసుల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ నిర్ణయంతో పోలీసులకు పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా అనంతపురం జిల్లాలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు, అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటాలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?