బీజేపీలోకి వెళుతున్నా... కాంగ్రెస్‌లో ఉండబోనన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి

తనకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్‌లో కొనసాగే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీ మారుతున్నానని వ్యాఖ్యానించారు. వారం పది రోజుల్లో బీజేపీలో చేరతానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవలాంటిదన్న ఆయన... స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గద్దె దించడం బీజేపీకే సాధ్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

తనలాంటి నేతలు బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీ తెలంగాణలో బలోపేతం అవుతుందని రాజగోపాల్ రెడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా... చేయకపోయినా బీజేపీలోకి వెళతానని వ్యాఖ్యానించారు. తన రాకను బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ సహా రాష్ట్రంలోని నేతలందరూ స్వాగతించారని అన్నారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?